HomeTelanganaTelangana: ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత...!

Telangana: ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి మే 31 వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. ఒకే చోట కనీసం మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఒకే స్టేషన్‌లో ఆరేళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.

ఈ బదిలీలు పారదర్శకమైన కౌన్సెలింగ్ పద్ధతిలో నిర్వహించబడతాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తించే అవకాశం ఉంది. ఈ బదిలీలకు సంబంధించి మరింత స్పష్టమైన అధికారిక జీవో (GO) త్వరలోనే విడుదల కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments