HomeTelanganaPaddy Procurement: ధాన్యంలో తాలు లేకుండా చూసుకోండి, రైతులకు వ్యవసాయ అధికారుల సూచన!

Paddy Procurement: ధాన్యంలో తాలు లేకుండా చూసుకోండి, రైతులకు వ్యవసాయ అధికారుల సూచన!

క్రైమ్ మిర్రర్, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఓపెన్ కానున్నాయి. NDCMS, PACS, IKP ఆధ్వర్యంలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. కొన్ని కేంద్రాలకు మిల్లులు ఇంకా అలాట్ కాకపోవడంతో కొనుగోళ్లు మొదలు కాలేదు. వీలైనం త్వరగా అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తాలు, తేమ విషయంలో రైతులకు అధికారులు సూచనలు

అటు ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఏఈవోలు ధాన్యం నాణ్యతను పరిశీలిస్తున్నారు. తేమశాతంతో పాటు ధాన్యం క్వాలిటీని చూసి కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ధాన్యంలో తాలు, మట్టిపెళ్లలు ఉండకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ తాలు ఉంటే శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా కనగల్లు మండలం చిన్న మాధారం క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) అభిలాష్ రెడ్డి ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు.

ఈ సందర్భంగా రైతులకు కీలక సూచనలు చేశారు. ధాన్యంలో మట్టిపెళ్లలు, తాలు, పూర్తిగా తయారు కాని ధాన్యం లేకుండా చూసుకోవాలన్నారు. తేమశాతం 17 శాతాలనికి లోపు ఉండాలన్నారు. “రైతులు ధాన్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తేమ నిర్ణీత పరిధిలోనే ఉండాలి. చక్కగా ఆరబెట్టి 17 శాతం లోపు తేమ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎవరి ధాన్యంలోనైనా తాలు ఉంటే, ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ప్యాడీ క్లీనర్ సాయంతో శుభ్రం చేసుకోవచ్చు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే వారి సీరియల్ నెంబర్ నమోదు చేయించుకోవాలి. ధాన్యంతో పాటు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, వాడుకలో ఉన్న బ్యాంక్ అకౌంట్ ను కొనుగోలు కేంద్రం నిర్వాహాకులకు అందించాలి. ధాన్యం కొనుగోలు జరిగిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి” అని అభిలాష్ రెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో అభిలాష్ రెడ్డితో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మెండె శంకర్, రావుల వెంకన్న, చిట్టిమల్ల కోటయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments