Homeజాతీయంసమర్ధులను ఎన్నుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుంది : సీఎం చంద్రబాబు

సమర్ధులను ఎన్నుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుంది : సీఎం చంద్రబాబు

క్రైమ్ మిర్రర్, జాతీయం:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమికి సపోర్టుగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల ప్రచారంలో పాల్గొన్నారు. త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు బిజెపి పార్టీ (ఎన్డీఏ) తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కడి ఓటర్లకు కూటమిని గెలిపించడం వల్ల జరిగే లాభాలు అలాగే అభివృద్ధి ఏంటి అనేది స్పష్టంగా వివరించారు. తమిళనాడు రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలి అంటే కచ్చితంగా రాష్ట్రంలో త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలి అని తమిళ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సమర్థులను ఎన్నుకుంటేనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం చెన్నైకి కేంద్రం 14 లక్షల కోట్లు ఇచ్చింది అని తెలియజేశారు. కానీ ఆ నిధులను చాలామంది దారి మళ్లించడం సమంజసమా?.. అంటూ నిలదీశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తో బుల్లెట్ స్పీడ్ గ్రోత్ ఉంటుంది అని ప్రజలకు వివరించారు. సింగిల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏం జరుగుతుందో చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాము అని ఇన్ డైరెక్ట్ గా విమర్శలు గుప్పించారు. కాగా ఈసారి తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయ్ మరోవైపు స్టాలిన్ ఎన్నికలను సీరియస్ తీసుకోగా ఎలాగైనా సరే ఈసారి తమిళనాడు రాష్ట్రాన్ని కూటమి కైవసం చేసుకోవాలి అని బిజెపి నాయకులు విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. మరి ఈసారి తమిళనాడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందో అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

రాష్ట్రంలో అకాల వర్షాలు.. ప్రజలు జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాల్లో కన్నీళ్లు పెడుతున్న ఉల్లి రైతులు!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments