HomeTelanganaరాష్ట్రంలో అకాల వర్షాలు.. ప్రజలు జాగ్రత్త!

రాష్ట్రంలో అకాల వర్షాలు.. ప్రజలు జాగ్రత్త!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కురుస్తున్న అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలందరూ విలవిలలాడిపోగా.. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నకాల వర్షాలకు ప్రజలకు ఉపశమనం కలుగుతున్నప్పటికీ గ్రామాల్లో వ్యవసాయం చేసేటటువంటి రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ఇలా అకాల వర్షాలు కురవడం వల్ల భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది అని అంటున్నారు. తాజాగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వార్త వంశాక అధికారులు తెలిపారు. మరి ఆ జిల్లాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వర్ష సూచన జిల్లాలు :-
1. అదిలాబాద్
2. నిర్మల్
3. నిజామాబాద్
4. జగిత్యాల
5. మంచిర్యాల
6. సంగారెడ్డి
7. మెదక్
8. మహబూబాబాద్
9. రంగారెడ్డి

పైన పేర్కొన్న ఈ తొమ్మిది జిల్లాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాదులోనూ సాయంత్రం సమయంలో ఉరుములతో కూడినటువంటి విపరీతమైనటువంటి వర్షాలు దంచి కొట్టనున్నాయి అని వెల్లడించారు. కాబట్టి గ్రామాలతో పాటు పట్టణాల్లో నివసించేటువంటి ప్రజలు అందరూ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు అని సూచించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments