HomeTelanganaలెంకలపల్లిలో క్రికెట్ జోరు...!

లెంకలపల్లిలో క్రికెట్ జోరు…!

  • లెంకలపల్లిలో క్రికెట్ జోరు..

  • జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

  • ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదిండ్ల భాస్కర్ చేతుల మీదుగా ప్రారంభం..

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): మర్రిగూడ మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామంలో క్రీడా ఉత్సాహం ఉప్పొంగింది. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో, ఈఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ సేవా తత్పరులు ఇరుగుదిండ్ల భాస్కర్ (ఈఎల్వి భాస్కర్)కు స్థానిక యువత డీజే హోరుతో ఘనస్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించిన అనంతరం, ఆయన స్వయంగా బ్యాట్ పట్టి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు

ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదిండ్ల భాస్కర్ చేతుల మీదుగా ప్రారంభం..
ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదిండ్ల భాస్కర్ చేతుల మీదుగా ప్రారంభం..

జాతీయ స్థాయికి, ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని, యువతను సన్మార్గంలో నడిపించేందుకు, క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. నిరంతరం సమాజ సేవలో ఉంటూ, పేదలకు అండగా నిలుస్తున్న భాస్కర్ గారు, క్రీడల పట్ల చూపుతున్న మక్కువను స్థానికులు కొనియాడారు. ఆయన అందిస్తున్న ప్రోత్సాహం కేవలం ఆటలకే పరిమితం కాకుండా, విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా విస్తరించి, ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ టోర్నమెంట్‌లో విజేతలకు మొదటి బహుమతిగా 50,016 రూపాయలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 25,016 రూపాయలను అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో మెలగాలని, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. మైదానంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని, అంపైర్ల నిర్ణయమే ఫైనల్ అని భావించి, నిబంధనలకు కట్టుబడి ఆడాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి క్రీడాకారుడు తగినంత నీటిని తీసుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మర్రిగూడ ఈఎల్వి ఫౌండేషన్ ఇంచార్జ్ ఐ.నరసింహ గౌడ్ పర్యవేక్షణలో టోర్నమెంట్ నిర్వహణ సాగుతుండగా, ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఎం.సతీష్ అశోక్, వెంకటేష్, శ్రీకాంత్, కిరణ్, కృష్ణ,ఎ. సతీష్,నరసింహ తదితరులు పాల్గొని క్రీడల విజయవంతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రీడా సంబరం లెంకలపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments