HomeTelanganaరాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల లకు అంతరాయం...!

రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల లకు అంతరాయం…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ వాహన్ (Vaahan) పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా వాహన్ పోర్టల్‌లో డేటా ప్రాసెసింగ్ కాకపోవడం వల్ల వేల సంఖ్యలో వాహనాలు షోరూమ్‌ల వద్దే నిలిచిపోయాయి. కొత్త వాహనాల కోసం శాశ్వత నంబర్లు కేటాయించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

ప్రత్యేక నంబర్‌ల (Fancy Numbers) కోసం చేసిన చెల్లింపుల రీఫండ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు తదుపరి దశకు (Processing) కదలడం లేదని షోరూమ్ నిర్వాహకులు నివేదిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రలైజ్డ్ సాఫ్ట్‌వేర్ సమస్య అని, దీని పరిష్కారంపై స్పష్టత రావడం లేదని రవాణా శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

తెలంగాణ రాష్ట్రం మార్చి 23, 2026 నుంచి ‘వాహన్’ పోర్టల్‌లోకి మారడం, ఏప్రిల్ 11 నుంచి పూర్తిస్థాయిలో శాశ్వత రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్ చేయాలని నిర్ణయించడం గమనార్హం. సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వాహనదారులు సహాయం కోసం కేంద్ర వాహన్ హెల్ప్‌డెస్క్ (+91-120-4925505) లేదా helpdesk-vahan@gov.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments