Homeసినిమాఓటీటీ లోకి వచ్చేసిన డిప్యూటీ సీఎం మూవీ!

ఓటీటీ లోకి వచ్చేసిన డిప్యూటీ సీఎం మూవీ!

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చివరిగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈరోజు ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలతో కలుపుకొని మొత్తంగా ఐదు భాషల్లో ఈ సినిమా ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చింది. కాగా హరిష్ శంకర్ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో శ్రీ లీల మరియు రాశీ ఖన్నా వంటి స్టార్ హీరోయిన్లు నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించినటువంటి ఈ మూవీ మార్చి 19వ తేదీన థియేటర్లో విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చివరిగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఇప్పటినుంచి పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోనే ఉండనున్నారు. పవన్ కళ్యాణ్ చివరిగా నటిస్తున్నటువంటి సినిమా కావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి పరుగులు తీశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వాగ్ మరియు డాన్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. థియేటర్లో ఓ ఊపు ఊపిన ఈ సినిమా ఈరోజు నుంచి ఓటిటిలో కూడా రికార్డ్స్ సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం వస్తున్నా… హైదరాబాద్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

ఏంటి పూరన్ భయ్యా… హిట్టర్ అనుకున్నాం కానీ అట్టర్ ప్లాప్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments