Homeక్రీడలుశుక్రవారం వస్తున్నా... హైదరాబాద్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

శుక్రవారం వస్తున్నా… హైదరాబాద్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- ఐపీఎల్ సీజన్ 19 లో భాగంగా ఇప్పటికే జరిగిన కొన్ని మ్యాచ్లకు SRH జట్టు మాజీ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ దూరమైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కమీన్స్ త్వరలోనే జట్టులో చేరనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే యువ బౌలర్లతో బలంగా మారిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగంలోకి తాజాగా కమిన్స్ వచ్చి చేరనున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ ఆస్ట్రేలియాలో టైం వేస్ట్ చేయకు త్వరగా ఇండియాకి రా.. ఐపిఎల్ నీకోసం ఎదురు చూస్తుంది అని కమిన్స్ కు కామెంట్ పెట్టారు. దీనికి కమిన్స్ వచ్చే శుక్రవారం వస్తున్నా అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈనెల 25వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయేటువంటి మ్యాచ్లో కమిన్స్ జట్టులో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యం పాత బౌలర్లను తొలగించి యంగ్ బౌలర్లకు అవకాశం ఇవ్వడం.. వారు మొదటి మ్యాచ్ లోనే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయడంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది. ఒకవేళ కమిన్స్ జట్టులో చేరగానే ఇషాన్ కిషన్ బదులుగా మళ్లీ కమిన్స్ కెప్టెన్ గా ఉంటారా లేదా అనేది జట్టు యాజమాన్యం తెలియజేయాల్సి ఉంది.

ఏంటి పూరన్ భయ్యా… హిట్టర్ అనుకున్నాం కానీ అట్టర్ ప్లాప్

నిప్పుల కొలిమిలా తెలంగాణ.. రానున్న 3 రోజులు భానుడి భీభత్సం, ఈ టైంలో బయటకు రావొద్దు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments