Homeజాతీయంరాజ్య స‌భ‌ స‌భ్యుడిగా నితీష్‌కుమార్‌ ప్ర‌మాణ స్వీకారం...!

రాజ్య స‌భ‌ స‌భ్యుడిగా నితీష్‌కుమార్‌ ప్ర‌మాణ స్వీకారం…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: బీహార్ రాజ‌కీయాల్లో క్రియ‌శీల నేత‌గా, సుదీర్ఘ‌కాలం పాటు ముఖ్యమంత్రిగా సేవ‌లందించిన నితీష్ కుమార్ శుక్ర‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో రాజ్య‌స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం, బిహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పునకు నాంది పలికింది. రాజ‌కీయ ఉద్దండుగా పేరుపొందిన నితీష్ కుమార్ రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌వ‌డంతో ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలిపారు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా…?

రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, నితీశ్ కుమార్ త్వరలోనే బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. నిన్ననే ఆయన తన సన్నిహితులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఏప్రిల్ 13 లేదా 14వ తేదీల్లో ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments