HomeTelanganaమ‌హిళా నిరుద్యోగుల‌కు తీపి క‌బురు...అంగ‌న్వాడీ పోస్టుల భ‌ర్తీకి గ్రీన్‌సిగ్న‌ల్‌...!

మ‌హిళా నిరుద్యోగుల‌కు తీపి క‌బురు…అంగ‌న్వాడీ పోస్టుల భ‌ర్తీకి గ్రీన్‌సిగ్న‌ల్‌…!

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు 15,000 అంగన్‌వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి సీతక్క విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

అంగ‌న్్వాడీ “పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరుగుతుంది. మెరిట్ ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తాము,” అని మంత్రి స్పష్టం చేశారు. అవినీతికి లేదా అక్రమాలకు తావు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.అంగన్‌వాడీ వ్యవస్థ స్థానిక వర్గాలతో ముడిపడి ఉన్నందున, ఆయా గ్రామాల్లో లేదా వార్డులలో నివసించే స్థానిక మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని సీతక్క తెలిపారు.

దీనివల్ల సేవలు మరింత మెరుగ్గా అందుతాయని, స్థానిక ఉపాధి పెరుగుతుందని ఆమె అన్నారు.ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్లను జారీ చేయడానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీల వివరాలను జిల్లాల వారీగా సేకరించి, అతి త్వరలోనే రోస్టర్ పద్ధతిలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఆమె తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments