HomeCrimeAdulterated Water Plants: కల్తీ నీటి ప్లాంట్లపై మెరుపు దాడులు..!

Adulterated Water Plants: కల్తీ నీటి ప్లాంట్లపై మెరుపు దాడులు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని “అంబర్‌పేట్” మరియు “ఓల్డ్ మలక్‌పేట్” ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కల్తీ నీటి ప్లాంట్లపై ఫుడ్ సేఫ్టీ మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఏప్రిల్ 7-9, 2026 తేదీల్లో హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ (బాపునగర్) మరియు ఓల్డ్ మలక్‌పేట్ పరిసరాల్లో ఈ దాడులు జరిగాయి. మెరుపు దాడులలో అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న సుమారు 3 వాటర్ ప్లాంట్లను అధికారులు సీజ్ చేశారు.

నీటి ప్లాంట్లు పాకురు పట్టి, అపరిశుభ్రంగా ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది. సరైన ఫిల్ట్రేషన్ లేకుండా నేరుగా ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నీటి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ప్రజలు కల్తీ నీటి ప్యాకెట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఐఎస్‌ఐ (ISI) మార్క్ మరియు లైసెన్స్ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments