HomeCrimeజ‌న‌సేనలో రాస‌లీల భాగోతం క‌ల‌కలం...త‌న‌ను మోసం చేశాడంటూ వీడియో రిలీజ్‌...! సోష‌ల్ మీడియాలో వైర‌ల్....

జ‌న‌సేనలో రాస‌లీల భాగోతం క‌ల‌కలం…త‌న‌ను మోసం చేశాడంటూ వీడియో రిలీజ్‌…! సోష‌ల్ మీడియాలో వైర‌ల్….

కోడూరు, క్రైమ్ మిర్ర‌ర్: జ‌న‌సేన నాయ‌కుల రాస‌లీలు రాష్ర్ట‌మంత‌టా చ‌ర్చానీయాంశంగా మారాయి. వారి భాగోతాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కి రావ‌డంతో పార్టీ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లుగుతోంది. రైల్వే కోడూరు మ్మెల్యే ఆరవ శ్రీధర్ ఘటన మరువకముందే తనను మోసం చేశాడంటూ మరో జనసేన నాయకుడి బాగోతాన్ని ఓ మహిళ బయటపెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం జడ్పీటీసీ జయప్రకాశ్ నాయుడు తననను ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని చిత్రహింసలు పెడుతున్నాడని భీమవరం గునుపూడికి చెందిన మద్దాల విజయలక్ష్మీ అనే మహిళ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో దుమారం రేపుతోంది.

తాను ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యాన్‌ను… ఆ అభిమానంతోనే…..

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పై అభిమ‌నాంతో భీమవరంలోని జనసేన పార్టీ ఆఫీసులో జరిగే ప్రతి కార్యక్రమానికి వెళ్లేదాన్ని అని ఆ వీడియోలో విజయలక్ష్మీ తెలిపింది. ఆ క్ర‌మంలోనే జయప్రకాశ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని పేర్కొంది. ఆ పరిచయంతోనే ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడని.. పెళ్లిచేసుకుంటానని ప్రపోజ్ చేశాడని చెప్పింది. కానీ అప్పటికే తనకు పెళ్లయి, విడాకులు తీసుకున్నానని.. మనకు సెట్ అవ్వదని చెప్పానని తెలిపింది. కానీ తనకు కూడా పెళ్లయ్యింది.. భార్య వదిలేసిందని.. నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి దగ్గరయ్యాడని తెలిపింది. అలా ఇద్దరూ రెండేళ్లు కలిసి ఉన్నామని బాధితురాలు తెలిపింది.

రూ. 10ల‌క్ష‌లు తీసుకొని చిత‌క బాదాడు… శారీర‌కంగా టార్చ‌ర్ పెడుతున్నాడు…

ఇల్లు కొంటున్నానని, ఆర్థికంగా ఇబ్బంది ఉందని చెప్పి రూ.10లక్షలు, బంగారం తీసుకున్నాడని బాధితురాలు వీడియోలో తెలిపింది. అప్పట్నుంచి జయప్రకాశ్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇష్టం లేనట్లుగా చూడటం, కొట్టడం వంటివి చేసేవాడని తెలిపింది. మద్యం మత్తులో తనను శారీరకంగా టార్చర్ చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. వాతలు వచ్చేలా కొట్టాడని తెలిపింది. ఆ గాయాలను బయటపెట్టింది. గంజాయి కలిపిన స్వీట్లు తినమని ఒత్తిడి చేసేవాడని వాపోయింది. అతని టార్చర్ భరించలేక పుట్టింటికి వెళ్లిపోయినా.. వేధించేవాడని పేర్కొంది.ఆ వేధింపులు తాళలేక దూరం వెళ్లిపోదామని అనుకుంటే.. నీ ఫొటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆ వీడియోలో కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments