Homeఆంధ్ర ప్రదేశ్ఒక్కరు కాదు.. ముగ్గురే ముద్దు : సీఎం చంద్రబాబు

ఒక్కరు కాదు.. ముగ్గురే ముద్దు : సీఎం చంద్రబాబు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా పరిస్థితులపై మరోసారి ఆసక్తికరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చారు. ముంబైలో జరిగినటువంటి ఎకనామిక్ టైమ్స్ సదస్సులో భాగంగా పలు వివరాలను చర్చించారు. దేశవ్యాప్తంగా జనాభా తగ్గిపోతుంది అన్న పరిస్థితులలో “ఒక్కరు వద్దు ముగ్గురు పిల్లలే ముద్దు” అంటూ కొత్త నినాదాన్ని చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారు. ఒకరికన్నా ఎక్కువమంది పిల్లలను కనాలి అని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకప్పుడు నేనే ముగ్గురు వద్దు ఒక్కరే ముద్దు అని అన్నాను. కానీ జనాభా తగ్గిపోవడం వల్ల భవిష్యత్తు రోజుల్లో చాలానే సమస్యలు వస్తాయి అని ముందుగానే అర్థం అవడంతో ఇటువంటి నినాదాలు చేయాల్సి వస్తుంది అని స్పష్టం చేశారు. భవిష్యత్తు రోజుల్లో జనాభా అనేది ఎంత కీలకం కానుందో ప్రతి ఒక్కరికి త్వరలోనే అర్థమవుతుంది అని తెలియజేశారు. మరోవైపు డి లిమిటేషన్ లో దాదాపు 50 శాతం సీట్లు పెంపు ద్వారా ఎవరికి ఎటువంటి నష్టం రాదు అని.. ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరుగుతుంది అని అన్నారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుంది అన్నారు.

కామారెడ్డిలో దారుణం…భార్య చేతిలో భ‌ర్త హ‌త్యా…!

నేడు డబుల్ ధమాకా… గెలిచే అవకాశం ఈ జట్లదే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments