HomeజాతీయంRaghav Chadha: శీష్ మహల్ వివాదం వల్లే ఆప్ ఓటమి, రాఘవ్ షాకింగ్ కామెంట్స్!

Raghav Chadha: శీష్ మహల్ వివాదం వల్లే ఆప్ ఓటమి, రాఘవ్ షాకింగ్ కామెంట్స్!

Sheesh Mahal Row: ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి “శీష్ మహల్” వివాదం చర్చకు వచ్చింది. ఈ అంశం కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని, అదే ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమని రాజ్యసభ మాజీ సభ్యుడు రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీని విడిచిన ఆయన, ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత ఆప్‌ పై, ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తున్నారు.

ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని దెబ్బతీసింది!

శీష్ మహల్ అంశం ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని దెబ్బతీసిందని చెప్పారు రాఘవ్ చద్దా. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ, ఇప్పుడు అదే ఆరోపణల మధ్య చిక్కుకుందని విమర్శించారు. పార్టీ లోపల పరిస్థితులు మారిపోయాయని, నిజాయితీగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు నిరాశతో బయటకు వస్తున్నారని ఆయన అన్నారు. తాము భయంతో కాదు, పార్టీ మార్గం నచ్చక బయటకు వచ్చామని స్పష్టం చేశారు.

ఇంతకీ ఏంటీ శీష్ మహల్ వివాదం?

శీష్ మహల్ వివాదం ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాస పునర్నిర్మాణానికి సంబంధించినది. కేజ్రీవాల్ నివాసం కోసం భారీగా ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఖరీదైన మార్బుల్, విలాసవంతమైన ఫర్నిచర్, ఖరీదైన ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సాధారణ జీవితం గడుపుతానని చెప్పిన నాయకుడు ఇలా విలాసవంతమైన ఇంట్లో ఉండడం సరైనదా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు.

ఈ వివాదం ఎన్నికల సమయంలో పెద్దగా చర్చకు వచ్చింది. ప్రజల్లో కూడా ఈ అంశంపై చర్చ నడిచింది. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ వివాదం పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపి, ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని భావిస్తున్నారు. మొత్తంగా  శీష్ మహల్ వివాదం కేవలం ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే కాకుండా, పార్టీ ప్రతిష్టను ప్రభావితం చేసిన అంశంగా మారింది. రాబోయే రోజుల్లో కూడా ఈ వివాదం రాజకీయాల్లో చర్చనీయాంశంగా కొనసాగే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments