HomeTelanganaరాష్ర్ట ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌టి క‌బురు...మే 25 నుంచే వ‌ర్షాలు...!

రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌టి క‌బురు…మే 25 నుంచే వ‌ర్షాలు…!

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఈ సంవ‌త్స‌రం మార్చి మొదటి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో భారత దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండలతో జనాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 43-44 డిగ్రీలు నమోదవుతున్నాయి.

రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే దేశ ప్రజలకు మరో చల్లని శుభవార్త కూడా చెప్పింది. గతంతో పోల్చుకుంటే ఈసారి నైరుతి రుతువపనాలు ముందే దేశాన్ని చేరుకుంటాయిన తెలిపింది.యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే పలకరించే అవకాశం ఉందని, . మే చివరి నాటికే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.

మే 18 నుండి 25 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో సాధారణం కంటే 30 నుండి 60 మి.మీ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయిని స్పష్టం చేశాయి.ఇక మే 25 నుండి జూన్ 1 మధ్య ఈ రుతుపవనాలు పశ్చిమ దిశగా కదిలి కేరళ తీరాన్ని, తమిళనాడులోని దక్షిణ జిల్లాలను తాకవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

రుతుపవనాల ప్రభావంతో అండమాన్ ఉత్తర ప్రాంతంలో ఒక ఉష్ణమండల వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందని. దీని కారణంగా రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదులుతాయని స్పష్టం చేసింది. ఇదే జరిగితే, ఎండలతో అల్లాడుతున్న కోట్లాది మంది ప్రజలకు ఉపశమనం లభించడమే కాకుండా, వ్యవసాయ పనులు కూడా త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments