HomeCrimeభారీగా మావోయిస్టుల లొంగుబాటు...!

భారీగా మావోయిస్టుల లొంగుబాటు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: భారీ ఎత్తున మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో పోలీసు ఉన్న‌తాధికారులు ఎదుట లొంగిపోయారు. 47 మంది మావోయిస్టులు లొంగి పోయి జ‌న‌జీవ‌న స్ర‌వంతితో క‌లిశారు. 34 ఆయుధాల‌ను పోలీసుల‌కు అప్్ప‌గించారు. వారిని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. లొంగిపోయి మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్ వాసులేనని పోలీసులు తెలిపారు.

గతేడాది డిసెంబర్‌లో 41 మంది మావోయిస్టులు.. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న సైతం లొంగిపోయారు. ఈ నెల రెండో వారంలో దాదాపు 30 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. తాజాగా మరో 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో అత్యధికులు ఛత్తీస్‌గఢ్ వాసులే కావడం గమనార్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments