HomeTelanganaశంక‌ర్ గౌడ్‌ది ముమ్మామిటి ప్ర‌భుత్వ హ‌త్యే...! బండి సంజ‌య్‌

శంక‌ర్ గౌడ్‌ది ముమ్మామిటి ప్ర‌భుత్వ హ‌త్యే…! బండి సంజ‌య్‌

క‌రీంన‌గ‌ర్‌, క్రైమ్ మిర్ర‌ర్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆక్షేపించారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అమలు చేయమంటున్నారని, కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు భాజపా పూర్తి మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడి.. కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments