Homeలైఫ్ స్టైల్పిల్లలు ఎత్తు ఎదగాలంటే ఏం చేయాలో తెలుసా?

పిల్లలు ఎత్తు ఎదగాలంటే ఏం చేయాలో తెలుసా?

క్రైమ్ మిర్రర్, జాతీయం:- ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు సరైన పోషకాహారం లేక అనారోగ్యం పాలవడమే కాకుండా ఎత్తు కూడా పెరగడం లేదు అని చాలామంది తల్లిదండ్రులు డాక్టర్లను అడుగుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాము. అలాగే చాలామంది పిల్లల ఎత్తుపై సోషల్ మీడియాలోనూ అలాగే లైవ్ షో ల లోను చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది వైద్యులు పిల్లలు త్వరగా ఎత్తు పెరగాలంటే ప్రతిరోజు ఏమి చేయాలి అనేది తెలియజేశారు.

ఈరోజుల్లో పిల్లలు ఎత్తు పెరగాలంటే సరైన పోషకాహారం, నిద్ర మరియు శారీరక శ్రమ ఎంతో అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రతిరోజు ఐరన్, జింక్ కాల్షియం ప్రోటీన్లు ఉండేటువంటి గుడ్లు.. ఆకుకూరలు, దుంపలు మరియు సీజన్ కు సంబంధించినటువంటి ఆయా పండ్లను ఇవ్వాలి. పట్టణాల్లో ఉండేటువంటి పిల్లలు ప్రతిరోజు ఏసీ గదుల్లో పెరగడం వల్ల ఇది కూడా ఎత్తు పెరగకపోవడానికి ఒక కారణం అవుతుంది అని.. కాబట్టి పిల్లల్ని ఎక్కువసేపు ఏసి గదుల్లోనే ఉంచకుండా ఆరు బయట ఆడుకొనివ్వాలి అని డాక్టర్లు సూచించారు. పిల్లలు ఆరు బయట ఆడుకోవడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది అని.. అలాగే స్విమ్మింగ్, స్కిప్పింగ్, స్టిచ్చింగ్ మరియు వేలాడడం వంటి వ్యాయామాలు ప్రతిరోజు కూడా చేయించాలి అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు ప్రతిరోజు 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవాలి అని… అప్పుడే సరైన ఆరోగ్యంతో పాటు ఎత్తు కూడా త్వరగా పెరగగలరు అని చెబుతున్నారు.

ఆర్టీసీ డ్రైవ‌ర్ పెట్రోల్ పోసుకొని నిప్ప‌టించుకొని ఆత్మ‌హ‌త్య‌…! ఆ ప్రాంతంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం…

స్టార్ ప్లేయర్లు ఉన్న గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ముంబై!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments