Homeసినిమాబాలకృష్ణ సినిమాలో హీరోయిన్ మార్పు.. కారణం ఏంటో తెలుసా?

బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ మార్పు.. కారణం ఏంటో తెలుసా?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- అఖండ -2 సినిమా తర్వాత బాలకృష్ణ మరో భారీ బడ్జెట్ సినిమాతో ముందుకు రానున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో మొదట బాలకృష్ణకు సరసన హీరోయిన్ నయనతారను ఎంపిక చేయగా కొన్ని అనివార్య కారణాలతో ఆమె స్థానంలో కాజల్ ను తీసుకున్నట్లు సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సినిమా స్క్రిప్ట్ లో చేసుకున్నటువంటి కొన్ని మార్పులు కారణంగానే హీరోయిన్ను మార్చాల్సి వచ్చింది అని సమాచారం. గోపీచంద్ మలినేని మరియు బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మొదటగా చారిత్రక నేపథ్యంలో తీయాలని అనుకోగా అందుకు కారణంగానే రాణి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం నయనతారను తీసుకోవాలనుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కానీ ఇప్పుడు చారిత్రక నేపథ్యం సినిమా కాకుండా పూర్తిగా స్క్రిప్ట్ను గ్యాంగ్స్టర్ కథగా మార్చడం కారణంగానే కాజల్ను తీసుకున్నట్లు తెలిపాయి. దీంతో గతంలో కూడా బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలు హీరోయిన్లను మార్చిన సందర్భాలు ఉన్నాయి. బాలకృష్ణ అఖండ మరియు అఖండ 2 సినిమాలు తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమాపై ప్రేక్షకులకు ఎంతగానో ఆసక్తి నెలకొంది. ఆసక్తితో పాటు ఈ సినిమాపై నందమూరి బాలకృష్ణ అభిమానులు హై ఎక్సపెక్టషన్స్ పెట్టుకున్నారు.

స్టార్ ప్లేయర్లు ఉన్న గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ముంబై!

Brutal Crime: బాత్ రూమ్ లో డెలివరీ.. కళ్లు కూడా తెరవని శిశువు దారుణ హత్య, అసలేం జరిగిందంటే?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments