Homeక్రీడలుSRH Win: అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ, SRH స్టన్నింగ్ విక్టరీ.. టాప్-3లోకి ఆరెంజ్ ఆర్మీ!

SRH Win: అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ, SRH స్టన్నింగ్ విక్టరీ.. టాప్-3లోకి ఆరెంజ్ ఆర్మీ!

SRH Crush Delhi Capitals by 47 Runs: సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి అద్భుత ప్రదర్శనతో మెరిసింది. సొంత మైదానంలో ఆడిన ఈ మ్యాచ్‌ లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. జట్టు సూపర్ ఫామ్‌లో ఉందని నిరూపించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ  అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 68 బంతుల్లోనే 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌ లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. దీంతో జట్టు భారీ స్కోరు సాధించగలిగింది.

242 పరుగులు చేసిన హైదరాబాద్

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. క్లాసెన్ 37 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, హెడ్ కూడా 37 పరుగులతో సహకరించాడు. ఇద్దరూ కీలక సమయంలో వేగంగా పరుగులు సాధించి జట్టును బలమైన స్థితిలోకి తీసుకెళ్లారు.

టార్గెట్ చేధించడంలో ఢిల్లీ విఫలం

తర్వాత లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రారంభంలో కొంత దూకుడు చూపించినా, మధ్యలో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి గురైంది. నితీష్ రాణా 57 పరుగులు చేసి పోరాడినా, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. సమీర్ రిజ్వీ, కేఎల్ రాహుల్ కొంతవరకు సహకరించినా, జట్టును గెలిపించలేకపోయారు.

నాలుగు వికెట్లు తీసిన మలింగ

ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో మలింగ కీలక పాత్ర పోషించాడు. అతడు 4 వికెట్లు తీసి ఢిల్లీ జట్టును కుదేలు చేశాడు. ముఖ్య సమయంలో వరుస వికెట్లు తీసి మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు మళ్లించాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 195 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది. మొత్తంగా అభిషేక్ శర్మ అద్భుత శతకం, మలింగ బౌలింగ్ ప్రదర్శన ఈ విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్-3లోకి చేరింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అభిషేక్ శర్మ ఎంపికయ్యాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments