HomeCrimeపాలు పొంగాయ‌ని భార్య‌పై కోపంతో భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌...!

పాలు పొంగాయ‌ని భార్య‌పై కోపంతో భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌…!

కడప, క్రైమ్ మిర్ర‌ర్: పాలు పొంగాయని భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప తాలూకా ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. తాలూకా ఎస్సై మహమ్మద్ రఫి వివరాల మేరకు.. కడప బాలాజీనగర్కు చెందిన వెంకటసుబ్బయ్య (53), అనురాధ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వెంకటసుబ్బయ్య గతంలో గల్ఫ్ ఉండేవారు. ఇటీవల కడపకు వచ్చి దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.

ప్రతి రోజు భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుండేవారు. ఈనేపథ్యంలో ఆదివారం భార్య స్టర్పై పాలు పెట్టడంతో అవి పొంగాయి. దీంతో భర్త నీకు ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేదంటూ కోపంతో తలను గోడకేసి కొట్టుకునే క్రమంలో చిన్నగాయమైంది. దీంతో భయపడి భార్య బయటికి వచ్చి కూర్చుంది.

ఈ సమయంలో భర్త ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నారు. ఆమె కొద్ది సేపటికి ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త ఫ్యాన్ కు వేలాడుతుండడంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి వెంకటసుబ్బయ్యను ఉరి నుంచి కిందికి దించిన కొద్ది సేపటికే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments