HomeCrimeఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు బెదిరింపు కలకలం..!

ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు బెదిరింపు కలకలం..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ లోని ఉప్పల్ మెట్రో స్టేషన్ కు మధ్యాహ్నం ఈ బెదిరింపు కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద కాసేపు కలకలం రేగింది. తనిఖీల అనంతరం ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కాల్ బూటకమని పోలీసులు తేల్చారు. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందన్న వార్తతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందిన వెంటనే ఉప్పల్ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది ఉత్తుత్తి కాల్ అని నిర్ధారించారు.అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకోవడానికి అధికారుల పర్యవేక్షణలో భాగంగా ఇది ఒక మాక్ డ్రిల్ (Mock Drill) అని కూడా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఆగంతకుడి ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments