HomeCrimeబేగంపేట‌లో విషాదం...దీపం వెలిగిస్తుండ‌గా ఘ‌ట‌న‌...రిటైర్డ్ ప్రిన్సిపాల్ మంట‌ల్లో...!

బేగంపేట‌లో విషాదం…దీపం వెలిగిస్తుండ‌గా ఘ‌ట‌న‌…రిటైర్డ్ ప్రిన్సిపాల్ మంట‌ల్లో…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: రోజువారిలాగే దీపం వెలిస్తున్న క్ర‌మంలో చీరకు మంట‌లు అంటుకొని రిటైర్డ్ ప్రిన్సిపాల్ మృతి చెందిన ఘ‌ట‌న బేగంపేట‌లో విషాదం చోటు చేసుకుంది. పూజా సమయంలో దీపం వెలిగిస్తుండగా విజయలక్ష్మీ చీరకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆమె భయంతో అటు ఇటు పరుగెత్తగా మంటలు మరింత వ్యాపించాయి. సోఫా, కర్టెన్లు, ఇతర ఫర్నిచర్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపడిపోయింది.

స్థానికులు గ‌మ‌నించి ఫైర్ సిబ్బందికి స‌మాచారం…

ఇంట్లో నుంచి పొగ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నించి స్థానికులు ఫైర్ సిబ్బందికి స‌మాచారం అందించారు. కాగా అప్పటికే విజయలక్ష్మీ మృతి చెందినట్లు తెలిసింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విజయలక్ష్మీ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పని చేసి రిటైర్ అయినట్లు తెలుస్తోంది. ఆమె బేగంపేట్ ష్యామ్‌లాల్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments