HomeCrimeఏసీబీ వ‌ల‌లో అవినీతి తిమిలింగం...రూ.30వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ ఏడీఈ...!

ఏసీబీ వ‌ల‌లో అవినీతి తిమిలింగం…రూ.30వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ ఏడీఈ…!

న‌ల్గొండ‌, క్రైమ్ మిర్ర‌ర్: గౌర‌వ ప్ర‌ద‌మైన హోదాలో ఉంటూ కాసుల‌కు క‌క్కుర్తి ప‌డి లంచాలు తీసుకుంటూ ఏసీబీ వ‌ల‌లో చిక్కి జీవితాల‌ను చిన్న‌భిన్నం చేసుకుంటున్న కొంద‌రి అధికారుల‌కు ప‌ద్ద‌తిలో మాత్రం మార్పు రావ‌డం లేదు. తాజాగా విద్యుత్ లైన్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు లంచం ఆశించిన నల్గొండ జిల్లా దేవరకొండ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

కంబాలపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2025లో వీచిన గాలివానకు దెబ్బతిన్న 33/11 కేవీ విద్యుత్ లైన్లను ఓ వ్యక్తి పునరుద్ధరించాడు. ఇందుకు సంబంధించిన రూ.10 లక్షల బిల్లును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపేందుకు సదరు ఏడీఈ రూ.30 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఏప్రిల్ 16న తన కార్యాలయంలో లంచం డబ్బులు తీసుకుంటుండగా సైదులును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, అతని వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసిజ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments