HomeCrime180 మంది మైనర్ బాలికలపై వేధింపులు..!

180 మంది మైనర్ బాలికలపై వేధింపులు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సుమారు 180 మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమరావతి జిల్లా పరట్వాడకు చెందిన 19 ఏళ్ల మొహమ్మద్ అయాజ్ (అలియాస్ తన్వీర్). సోషల్ మీడియా (స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్) ద్వారా బాలికలను “ప్రేమ” పేరుతో ట్రాప్ చేసి, వారిని ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకెళ్లి వేధించేవాడు.

నిందితుడు దాదాపు 350కి పైగా అసభ్యకర వీడియోలను చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బాలికలను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, అధికారులు పరట్వాడలోని అతని నివాసంలో ఉన్న అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం మరియు ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments