HomeTelanganaతెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. ఈ ఐదు రోజులు భారీ వర్షాలు, ఎండల నుంచి ఉపశమనం

తెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. ఈ ఐదు రోజులు భారీ వర్షాలు, ఎండల నుంచి ఉపశమనం

తెలంగాణ వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. వేడి గాలులు తోడవడంతో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. ఏప్రిల్ 18వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా ఏప్రిల్ 19 నుంచి 23 వరకు హైదరాబాద్ నగరంలో తేలికపాటి జల్లులు పడే వీలుంది. వికారాబాద్‌ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో సాయంత్రం వేళల్లో వరుణుడు పలకరించనున్నాడు. తూర్పు హైదరాబాద్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 4 గంటల నుంచే వర్షం కురిసే ఛాన్స్ ఉంది. హన్మకొండ యాదాద్రి భువనగిరి నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచి 24 మధ్య మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడి వేడి నుంచి ఉపశమనం కలుగుతుందని విశ్లేషించారు.

అయితే ఈ స్వల్పకాలిక వర్షాల తర్వాత ముప్పు పొంచి ఉంది. మే జూన్ నెలల్లో ఎండలు అత్యంత తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వేడి గాలులు ప్రాణాంతకమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధులు గర్భిణులు చిన్నారులు బయట పనిచేసే కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పారిశుద్ధ్య కార్మికులు వ్యవసాయ కూలీలు గృహహీనులపై ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

పెరుగుతున్న వేడిని తట్టుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జిల్లా విపత్తు నిర్వహణ సంస్థలు రంగంలోకి దిగాయి. పాఠశాలలు అంగన్‌వాడీ కేంద్రాలు కమ్యూనిటీ హాళ్లలో ప్రత్యేక కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. బస్టాండ్లు మాల్స్ ప్రార్థనా మందిరాల వద్ద చలివేంద్రాలు నిర్మిస్తున్నారు. ప్రజలకు మంచినీరు మజ్జిగ సరఫరా చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. వడదెబ్బ లక్షణాలపై అవగాహన కల్పించేందుకు ఎప్పటికప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.

నిబంధనల విషయానికి వస్తే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కార్మికులు బయట పనులు చేయకూడదు. అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 11 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాలల్లో ఆరుబయట తరగతులు నిర్వహించడాన్ని నిషేధించారు. విద్యార్థులు సరిపడా నీరు తాగేలా ప్రత్యేకంగా ‘వాటర్ బెల్స్’ మోగిస్తున్నారు. పరిస్థితిని బట్టి స్కూల్ పని వేళలను మరింత తగ్గించాలని విద్యాశాఖ భావిస్తోంది.

ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఆసుపత్రులు తాగునీటి కేంద్రాలకు నిరంతర విద్యుత్ అందించాలని ఇంధన శాఖను ఆదేశించారు. ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక బెడ్లు ఐస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. ఫ్యాక్టరీల్లో కార్మికుల రక్షణపై మేనేజర్లకు అవగాహన కల్పిస్తున్నారు. మూగజీవాల కోసం పశుసంవర్ధక శాఖ నీటి తొట్లు నీడ ఉన్న ప్రదేశాలను ఏర్పాటు చేస్తోంది. ఎండ తీవ్రత తగ్గే వరకు ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సర్కారు కోరింది.

ALSO READ: దక్షిణాది గొంతు నొక్కితే సహించేది లేదు.. మోదీ సర్కార్ కు కేటీఆర్ హెచ్చరిక

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments