HomeCrimeWife brutally murders her husband: క‌ట్టుకున్న వాడిని క‌ర్క‌శ‌కంగా హ‌త్య చేయించిన భార్య‌...ఏమి తెలియ‌న‌ట్టు...

Wife brutally murders her husband: క‌ట్టుకున్న వాడిని క‌ర్క‌శ‌కంగా హ‌త్య చేయించిన భార్య‌…ఏమి తెలియ‌న‌ట్టు నాట‌కం…!అస‌లు నిజం తెలియ‌డంతో…

హన్మకొండ, క్రైమ్ మిర్ర‌ర్: పెళ్లి అనేది నూరేళ్ల బంధం అంటారు పెద్ద‌లు…కానీ బంధాలు, మాన‌వ‌త్వాలు క‌నిపించ‌డం లేదు. ప‌రాయి వ్య‌క్తి మోజులో ప‌డి క‌ట్ట‌కున్న వారినే చంపేసే ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా భ‌ర్త అనే ప‌దానికి అర్థం లేకుండా వివాహేత‌ర సంబంధం మోజులో ప‌డి క‌ట్ట‌కున్న భార్య‌నే సుఫీరీ గ్యాంగ్‌తో చంపేసిన వరంగ‌ల్ జిల్లాలో చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా తాడ్వాయిలో 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సుమన్, లావణ్య.. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు.

లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడగా.. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని, సుపారీ గ్యాంగ్ తో కలిసి లావణ్య పథకం వేసింది. అందులో భాగంగా సుమన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీరు సీసాలతో విచక్షణారహితంగా పొడిచి చంపి, తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టింది సుపారీ గ్యాంగ్. అయితే, పోలీసులు లావణ్య తీరుపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ జరిపారు.

దీంతో అసలు నిజం బయటపడింది. ప్రియుడితో కలిసి ఉండడానికి భర్తను తానే హత్య చేయించినట్లు లావణ్య ఒప్పుకుంది. లావణ్యను, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. వివాహేత‌ర సంబంధాలు ఎంత ప్ర‌మాద‌మో ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments