HomeCrimeఢిల్లీలో ఘోర హృద‌య విదార‌క ఘ‌ట‌న‌...నిద్ర‌లోనే మంట‌ల్లో...! భార్య‌భ‌ర్త‌లు అగ్నికి ఆహుతి...

ఢిల్లీలో ఘోర హృద‌య విదార‌క ఘ‌ట‌న‌…నిద్ర‌లోనే మంట‌ల్లో…! భార్య‌భ‌ర్త‌లు అగ్నికి ఆహుతి…

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ఢిల్లీలో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో భార్య‌భ‌ర్త‌ల‌తో స‌హా మూడేళ్ల చిన్నారి సైతం అగ్ని కీలల్లో స‌జీవ‌ద‌హ‌న‌మైన ఘ‌ట‌న ప‌లువురిని కంటత‌డిపెట్టించింది. ఢిల్లీలోని బుద్ధ‌విహార్ ప‌రిధిలోని స్ల‌మ్ ఏరియాలో బుధ‌వార రాత్రి 1.25గంట‌ల ప్రాంతంలో గుడిసెల‌కు మంట‌లు అంటుకొని అప్ర‌మ‌త్త‌మ‌య్యేలోపే ఒకే కుటుంబానికి చెందిన‌ భార్య‌భ‌ర్త‌లు, మూడేళ్ల చిన్నారిలో మంట‌లో ద‌హ‌నం అయ్యారు. దీంతో స్థానికంగా అంద‌రిని క‌ల‌చి వేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్ధవిహార్‌ పరిధిలోని స్లమ్ ఏరియాలో సుమారు 400 చదరపు గజాల ప్లాస్టిక్ స్క్రాప్‌ను నిల్వ ఉంచారు. దాని చుట్టే పలు గుడిసెలను నిర్మించుకున్నారు. అయితే బుధవారం తెల్లవారుజామున 1.25 గంటల ప్రాంతంలో స్క్రాప్‌‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన గుడిసెల్లోని కుటుంబాలు మంటలు అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇరుకైన వీధుల కారణంగా అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, గుడిసెలకు మంటలు అంటుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో భద్రతా ప్రమానాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments