HomeTelanganaడిలిమిటేష‌న్ బిల్లుకు మ‌ద్ద‌తే కానీ....అంశాల‌ను ప‌రిశీలించాకే...! కేసీఆర్‌

డిలిమిటేష‌న్ బిల్లుకు మ‌ద్ద‌తే కానీ….అంశాల‌ను ప‌రిశీలించాకే…! కేసీఆర్‌

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: దేశంలో ఎక్క‌డ చూసిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌బిల్లుపై చ‌ర్చా కొన‌సాగుతోంది. దీనిని పై తాజాగా బీఆర్ ఎస్ కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసిందింది. బీఆర్ ఎస్ మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌కు పూర్తితి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని డి లిమిటేష‌న్ ప‌ట్ల ద‌క్షిణాధికి అన్యాయం జ‌రిగేలా ఉంటూ ఒప్పుకునేది లేద‌ని స్ప‌స్టం చేసింది. కేటీఆర్, హరీష్ రావులతో భేటీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. తొలిసారి అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో తీర్మనించామని గుర్తుచేసిన కేసీఆర్, ఆ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలపనున్నట్లు వెల్లడించారు.

డీలిమిటేషన్ బిల్లులో పొందుపరిచిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే పార్టీ ఒక నిర్ణయానికి వస్తుందని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాదికి 24% ఎంపీ సీట్లు ఉన్నాయని, అంతకంటే తగ్గకుండా 50% పెంచాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేసీఆర్ అభిప్రాయం. డీలిమిటేషన్ బిల్లు సమగ్రంగా పరిశీలించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఇదే క్రమంలో 20న జగిత్యాల సభ, 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి కేసీఆర్ చర్చించినట్లు సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments