Homeక్రీడలుఅరంగేట్రంలోనే అదరగొట్టిన బౌలర్లు.. కోచ్ సంచలన వ్యాఖ్యలు!

అరంగేట్రంలోనే అదరగొట్టిన బౌలర్లు.. కోచ్ సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్-19 సీజన్ లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ విజయానికి ముఖ్య కారణం అరంగేట్రం చేసినటువంటి బౌలర్లు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈ ఏడాది బౌలర్ల లోటు ఉంది అని.. వీళ్ళ నుంచి మంచి పర్ఫామెన్స్ రావట్లేదు అని సోషల్ మీడియా నుంచి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఈ సందర్భంలోనే నిన్న ప్రఫుల్ ఎంగే, హుస్సేన్ అనే యువ బౌలర్ల ను రంగంలోకి దింపారు. అయితే వీళ్ళు అరంగేట్రంలోనే అదరగొట్టారు. వరస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ కు ఈ ఇద్దరు బౌలర్లు అడ్డుకట్ట వేశారు. మ్యాచ్ అనంతరం వీరిద్దరి ప్రతిభను ప్రశంసిస్తూ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ వరుణ్ అరుణ్ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో యంగ్ ప్లేయర్ త్వరలోనే జట్టులో చేరుతాడు అని… అతడు కూడా ఒక గొప్ప బౌలర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంకా ఎంతోమంది స్టార్ బౌలర్లు బెంచ్ లో ఉన్నారు అని.. వారిని ప్రస్తుతం దాచామంటూ కోచ్ వరుణ్ హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ కు మరింత జోష్ ను నింపారు.

రాజధాని అంటే సిరిసంపదలతో తూగాలి.. దివాలా తీసేలా కాదు : పేర్ని నాని

ప్ర‌పంచ మేధావి అంబేద్క‌ర్‌…సీఎం రేవంత్ రెడ్డి…!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments