HomeCrimeమ‌ద‌న‌ప‌ల్లిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం...ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం...!

మ‌ద‌న‌ప‌ల్లిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం…!

మదనపల్లి, క్రైమ్ మిర్ర‌ర్‌: మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుంకుంది. మండలంలోని సిటిఎం కంకర ఫ్యాక్టరీ వద్ద కారు ఇన్నోవా ఎదు రెదురు ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు. మండలంలోని కొత్తవారిపల్లి పంచాయతీ, పూలవండ్లపల్లి కు చెందిన శేషాద్రి రమణ 36 సిటిఎం ఇండియన్ బ్యాంకులో అటెండర్ గా పనిచేసే విధులు ముగించుకుని బైకులో ఇంటికి బైక్ లో బయలుదేరాడు. స్కూటర్ మార్గమధ్యంలోని కంకర ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్ళగానే మదనపల్లె దేవత నగర్ ముజీబ్ నగర్ లకు చెందిన జావీద్, అస్లాం, ముబారక్ మరో యువకుడు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు బైక్ ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో స్కూటర్ లో వెళుతున్న శేషాద్రి రమణ అక్కడి కక్కడే దుర్మరణం చెందగా, కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టి అందులో ఉన్న ఓ 13 ఏళ్ళ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ముగ్గురిని వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments