HomeTelanganaదీపక్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా NSUI ఆవిర్భావ వేడుక

దీపక్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా NSUI ఆవిర్భావ వేడుక

NSUI 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గంలో గాయత్రి నగర్ 254 డివిజన్ లో ఘనంగా జరిగాయి. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు దీపక్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,పెన్నులు మరియు ఇతర బహుమతులను అందజేశారు. విద్యార్థుల చదువులకు చేతనైన సహాయం అందించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు దీపక్ యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణికంఠ శ్రీనివాస్, చింటు, సంతోష్, కళ్యాణ్, బిస్వజిత్, రింకు, రితిక్, లాలా, రాకేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments