HomeCrimeఎమ్మెల్యేకు సైబ‌ర్ నేర‌గాళ్ల టోక‌రా...రూ.ల‌క్ష స్వాహా...!

ఎమ్మెల్యేకు సైబ‌ర్ నేర‌గాళ్ల టోక‌రా…రూ.ల‌క్ష స్వాహా…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: సాధారణ ప్రజలనే కాకుండా చదువుకున్న వారిని, ఉద్యోగాలు చేసే వారిని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. తాజా ప్ర‌జా ప్ర‌తినిధి, ఓ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేనే సైబ‌ర్ నేర‌గాళ్లు బురిడి కొట్టించారు. సైబ‌ర్ నేర‌గాళ్లు కేంద్ర ప‌థ‌కం పేరుతో ఏకంగా ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికి టోక‌ర వేసి ల‌క్ష కాజేశారు. ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన ఓ వ్య‌క్తి కేంద్ర పథ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే రూ.10ల‌క్ష‌ల లోన్లు వ‌స్తాయ‌ని చెప్పిన సైబ‌ర్ నేర‌గాడు అందుకు అప్లికేషన్ ఫీజు కింద ఏకంగా రూ.లక్ష వసూలు చేశాడు. ఆ వ్యక్తి తీరుపై అనుమానం వచ్చిన ఎమ్మెల్యే.. సైబర్ నేరం జరిగిందని భావించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు

బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బురిడీ కొట్టించిన ఓ సైబర్ కేటుగాడు.. ఏకంగా రూ. లక్ష కాజేశాడు. అది సైబర్ మోసమని గుర్తించిన ఎమ్మెల్యే పల్లా.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఆదివారం ఉదయం ఒక వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. అతడు తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్నాడు. తన పేరు అనంతరామిరెడ్డి అని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్‌ భారత్‌ పథకం కింద అర్హులైన వారికి రూ.10 లక్షల వరకు లోన్లు వస్తాయని చెప్పి నమ్మించాడు. జనగామ నియోజకవర్గంలో ఒక 40 మంది అర్హుల లిస్ట్ పంపిస్తే.. వారికి వెంటనే రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments