HomeCrimeఘోరం...అర్థ‌రాత్రి వేట కొడ‌వ‌ల్ల‌తో దాడి....! జూనియ‌ర్ లాయ‌ర్ దారుణ హ‌త్యా...

ఘోరం…అర్థ‌రాత్రి వేట కొడ‌వ‌ల్ల‌తో దాడి….! జూనియ‌ర్ లాయ‌ర్ దారుణ హ‌త్యా…

వ‌డ్డివ‌ల్లి, క్రైమ్ మిర్ర‌ర్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమాల్లోగా ఫ్యాక్ష‌న్ రాజ‌కీయ హ‌త్య ఆ ప్రాంతంలో క‌ల‌కం రేపింది. అన్న‌మ‌య్య జిల్లాలో జూనియ‌ర్ న్యాయ‌వాదిగా ప‌ని చేస్తున్న ఎల్ల‌య్య‌ను దుండ‌గులు దారుణంగా న‌రికి చంపేశారు. అడ్డుకునేందుకు వ‌చ్చిన ఆయ‌న తల్లిదండు్ర‌ల‌పై కూడ విచ‌క్ష‌ణ ర‌హితంగా డాడి చేయ‌డంతో వారు కూడ ప్రాణ‌ప్రాయ‌స్థితిలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా పాత కక్షలను మనసులో పెట్టుకున్న ప్రత్యర్థులు, పథకం ప్రకారం ఎల్లయ్య ఇంటిపై పడి వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఎల్ల‌య్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.కాగా కుమారుడిని కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఎల్లయ్య తల్లిదండ్రులపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గ్రామంలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు…

లాయర్ ఎల్ల‌య్య‌ హత్య వార్త తెలియగానే వడ్డిపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో మళ్లీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.

ఇవి కూడా చదవండి ….

  1. Telangana: ఆధ్యాత్మిక రాజకీయం…!

  2. Revanth Master Plan: త్రిశూల్ వ్యూహం.. బల్దియా పై రేవంత్ స్పెషల్ గురి!

  3. Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణకు బ్రేక్.. ఆశావహులపై సీఎం రేవంత్ నీళ్లు!

  4. Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు…!

  5. ఆ మత మార్పిడిల వెనుక జగన్…?!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments