HomeTelangana ఆత్మకూరు(ఎం)లో ఉచిత ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహణ...!

 ఆత్మకూరు(ఎం)లో ఉచిత ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహణ…!

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని ఆత్మకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా ఎన్సీడీ(బీపీ, షుగర్)స్క్రీనింగ్ క్యాంప్‌ను అనుభవజ్ఞులైన ప్రభుత్వ డాక్టర్లచే సోమవారం రోజు నిర్వహించడం జరిగింది.ఆత్మకూరు గ్రామ సర్పంచ్ బిసు ధనలక్ష్మి చందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీపీ మరియు షుగర్ పరీక్షలను ఉచితంగా సుమారు 200 మంది పేషెంట్లకు నిర్వహించినట్లు తెలిపారు.

గ్రామ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ డాక్టర్లు మరియు సిబ్బంది:డాక్టర్ ఎస్ అమరావతి(మెడికల్ ఆఫీసర్), సిహెచ్ఓ రాకేష్ సింగ్,హెచ్ఎస్ ఎం అజీజ్,హెచ్ఎస్ ఎఫ్ మరియా,హెచ్ఎస్ ఎఫ్ కాలమ్మ,ఎంపీహెచ్ఎ ఎఫ్ మమత,ఆశా వర్కర్లు, తదితరులు సేవలందించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్, గ్రామ కార్యదర్శి అంబోజు శేఖర్, వార్డ్ మెంబర్లు లోడి శ్రీను, బూడిది శేఖర్, ఎలాగందుల సైదుల్, గడ్డం సతీష్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments