Homeజాతీయంపడిపోయిన చికెన్ ధరలు.. మాంసం ప్రియులకు పండగే..

పడిపోయిన చికెన్ ధరలు.. మాంసం ప్రియులకు పండగే..

నాన్ వెజ్ ప్రియులకు ఊరట కలిగించే వార్త ఇది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టి ఇప్పుడు స్థిర స్థాయిలో కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.350 వరకు పెరిగి వినియోగదారులను ఇబ్బంది పెట్టగా, ఆ తరువాత క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు పెద్ద సంఖ్యలో మాంసం దుకాణాల వద్దకు చేరుకుని క్యూలలో నిలబడుతూ తమకు కావాల్సిన చికెన్ కొనుగోలు చేస్తున్నారు. సెలవు రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి మాంసాహార వంటలు చేసుకుని సేదతీరుతున్నారు. ధరలు కూడా పెద్దగా పెరగకపోవడంతో వినియోగదారుల్లో ఆనందం కనిపిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.276గా కొనసాగుతుండగా, డ్రెస్స్డ్ చికెన్ రూ.242 వద్ద ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.167గా ఉండగా, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.140 వద్ద లభిస్తోంది. విజయవాడలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.267గా, డ్రెస్స్డ్ చికెన్ రూ.235గా ఉంది. అక్కడ రిటైల్ లైవ్ బర్డ్ రూ.162గా ఉండగా, ఫారం వద్ద లైవ్ బర్డ్ రూ.135కు అమ్ముతున్నారు. కరీంనగర్ ప్రాంతంలో స్కిన్ లెస్ చికెన్ రూ.276గా ఉండగా, వరంగల్‌లో రూ.280, కామారెడ్డి జోన్‌లో రూ.290గా ఉంది. గుంటూరులో రూ.250, విశాఖలో రూ.270, బాపట్లలో రూ.300 వరకు ధరలు నమోదవుతున్నాయి. ఈ ధరలు ప్రాంతాల వారీగా మారుతూ ఉండటానికి స్థానికంగా ఉన్న కోళ్ల ఫార్ములు, సరఫరా పరిస్థితులు, రవాణా ఖర్చులు వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

మార్చి నెల చివర్లో చికెన్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకుని కిలోకు రూ.400 వరకు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత సరఫరా పెరగడం, మార్కెట్ పరిస్థితులు మారడం వల్ల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా తెలంగాణలో కొన్ని రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కోళ్ల సరఫరా అధికంగా జరగడం కూడా ధరలు తగ్గడానికి కారణమైంది అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ధరలు మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం చికెన్ ధరలు అందుబాటులో ఉండటంతో సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించింది.

ALSO READ: తల్లికి వందనం నిధులపై బిగ్ అప్‌డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments