Homeలైఫ్ స్టైల్బానెడు పొట్ట కూడా మటాష్ అవ్వాలంటే.. రాత్రంతా పులియబెట్టి పొద్దున్నే తాగండి

బానెడు పొట్ట కూడా మటాష్ అవ్వాలంటే.. రాత్రంతా పులియబెట్టి పొద్దున్నే తాగండి

ఆరోగ్యకరమైన జీవన విధానానికి సంప్రదాయ ఆహారాల ప్రాముఖ్యత రోజురోజుకీ పెరుగుతోంది. అలాంటి పోషకాహారాల్లో ఒకటైన రాగి జావ, బరువు తగ్గడం నుంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే ఈ పానీయం, రోజువారీ అల్పాహారంగా తీసుకుంటే శక్తిని అందించడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. రాగుల్లో సహజంగా కాల్షియం, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో ఎముకల బలానికి తోడ్పడుతుంది. కీళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలతో బాధపడేవారికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. అదేవిధంగా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా రాగి కీలక పాత్ర పోషిస్తుంది.

పులియబెట్టిన రాగి జావలో సహజ ప్రోబయోటిక్ గుణాలు అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. మంచి బ్యాక్టీరియా వృద్ధికి దోహదపడుతూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాగి అంబలి తీసుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గాలని భావించే వారికి, అలాగే మధుమేహం ప్రారంభ దశలో ఉన్నవారికి కూడా ఇది అనుకూలమైన ఆహారం. అయితే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

రాగి జావ తయారీ విధానం సంప్రదాయ పద్ధతిలో చేయడం వల్ల మరింత ప్రయోజనం లభిస్తుంది. రాత్రి సమయంలో మట్టి కుండలో నీరు తీసుకుని, అందులో రాగి పిండిని ముద్దలు లేకుండా బాగా కలపాలి. రాగి పిండి మొలకెత్తిన రాగుల నుంచి లేదా సాధారణ రాగుల నుంచి తయారు చేసుకోవచ్చు. ముందుగా నీటిని మరిగించి కొద్దిగా ఉప్పు వేసి, తరువాత రాగి మిశ్రమాన్ని జోడించి మరిగించాలి. మట్టి పాత్రలో ఉడికించిన తరువాత అది సహజంగా మరికొంతసేపు వేడి నిలుపుకుంటుంది. ఆ తరువాత చల్లారనివ్వాలి. దానికి మూతపెట్టి పల్చని వస్త్రంతో కప్పి రాత్రంతా పులియబెట్టాలి.

మరుసటి రోజు ఉదయం పులిసిన రాగి జావలో తగినంత పెరుగు కలిపి, అవసరమైతే కొద్దిగా నీరు జోడించి తాగాలి. దీన్ని కొంచెం చిక్కగా తీసుకుంటే ఇంకా మంచిది. రుచికోసం ఉల్లిపాయలు లేదా తాళింపు వేసుకుని కూడా తీసుకోవచ్చు. తాళింపులో కరివేపాకు, పసుపు కలిపితే ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఇదే విధంగా సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి ఇతర ధాన్యాలతో కూడా అంబలి తయారు చేసుకోవచ్చు.

సంప్రదాయ పాత్రలు అయిన మట్టి కుండలు, ఇనుప పాత్రల్లో వంట చేయడం వల్ల పోషక విలువలు మరింత మెరుగవుతాయి. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, యోగా, నడక, సరళమైన ఆహార అలవాట్లను పాటించడం ఎంతో అవసరం. రాగి జావ వంటి సంప్రదాయ ఆహారాలు శరీరానికి చలువనిచ్చేలా ఉండటమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యానికి బలమైన ఆధారంగా నిలుస్తాయి.

ALSO READ: అనుష్కను తన్నాను.. అడవి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments