HomeCrimeతెలుగు రాష్ర్టాల‌కు చ‌ల్ల‌టి క‌బురు...మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు...!

తెలుగు రాష్ర్టాల‌కు చ‌ల్ల‌టి క‌బురు…మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎండ‌లు భ‌గ్గుమంటున్నాయి. ఉక్క పోత‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ‌ధ్యాహ్న పూట సుమారు ఎండ‌లు 40 నుంచ 45 డిగ్రీల మ‌ధ్య న‌మోదు అవుతున్నాయి. భ‌య‌ట‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. వ‌డ‌గాల్పుల కార‌ణంగా కొంద‌రు అస్వ‌స్థ‌కు గుర‌వుతున్నాయి.

మ‌రోమూడు రోజులు వ‌ర్షాలు…

మండే ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు భారత వాతావరణ శాఖ ఊరట కలిగించే వార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంది. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

శని, ఆది సోమవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments