HomeTelanganaమైసిగండి మైసమ్మ దేవాలయంలో ఉచిత దర్శనం కరువు.. భక్తుల ఆవేదన

మైసిగండి మైసమ్మ దేవాలయంలో ఉచిత దర్శనం కరువు.. భక్తుల ఆవేదన

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- కడ్తాల్ మండలం పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవస్థానం లో భక్తులకు ఉచిత దర్శనం లేకపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా డబ్బులు చెల్లించి టికెట్ తీసుకుంటేనే దర్శనం కల్పిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నప్పటికీ, ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే ఉచిత దర్శనం లేకపోవడం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ముఖ్యంగా పేద భక్తులు దేవుడి దర్శనం కోసం కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని వారు చెబుతున్నారు.
ప్రతిరోజూ వందల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ ఆలయంలో, దర్శనం కోసం డబ్బులు వసూలు చేయడం అన్యాయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దేవుడిని చూడటానికి కూడా చెల్లించాలా?అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై తెలంగాణ దేవాదాయ శాఖ పర్యవేక్షణపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, భక్తులకు ఉచిత దర్శనం కల్పించడంతో పాటు దేవాలయ నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.

బడిబాట కార్యక్రమంలో వెల్లంకి ఉపాధ్యాయులు

YSRCP MLCs Resignations: వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం.. కోర్టు ఆదేశాలతో నిర్ణయం అనివార్యం!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments