Homeలైఫ్ స్టైల్బరువు తగ్గాలనుకుంటే ఈ సమ్మరే బెటర్.. ఎందుకంటే?

బరువు తగ్గాలనుకుంటే ఈ సమ్మరే బెటర్.. ఎందుకంటే?

క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్ :- ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు ఊబకాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఈ రోజుల్లో అధిక బరువుతో ఇబ్బందులకు గురవుతూ ఎన్నో వైద్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి వైద్యులు ఒక గుడ్ న్యూస్ తెలిపారు. బరువు తగ్గడానికి వేసవికాలం మంచి సీజన్ అంటూ పేర్కొన్నారు. చలికాలం మరియు వర్షాకాలంతో పోలిస్తే ఈ వేసవికాలంలో చాలామంది ఉదయం త్వరగా నిద్ర లేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో వాకింగ్ లేదా రన్నింగ్ కు వెళ్తే చెమట ద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయవచ్చు అని తెలిపారు. వీటన్నిటితో పాటుగా స్విమ్మింగ్ కూడా చేస్తే మరింత క్యాలరీలు బర్న్ అవుతాయని సూచించారు. వేసవి కాలంలో ఎక్కువగా వేడి ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆహారం అనేది ఎక్కువగా తినలేరు. కావున ఇది ఒక రకంగా బరువు పెరగకపోవడానికి కీలకపాత్ర పోషిస్తుంది. ఈ వేసవి కాలంలో లభించేటువంటి ఎన్నో ఆహార పదార్థాలు.. పుచ్చకాయ, నారింజ, దోస మరియు కొబ్బరి నీళ్లు వంటివి తీసుకుంటే జీర్ణ క్రియ మరింత మెరుగవుతుంది. కాబట్టి వేసవికాలం శరీరానికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి అని డాక్టర్లు చెబుతున్నారు.

తిండి పెట్టిన వృద్ధురాలు మృతి.. తల్లడిల్లిన కోతి (VIDEO)

స‌రిత‌ పై చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వం…!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments