Homeసినిమాఆరోజు 'అన్న' మాటలు ఎప్పటికీ మర్చిపోను : నిహారిక

ఆరోజు ‘అన్న’ మాటలు ఎప్పటికీ మర్చిపోను : నిహారిక

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మెగా డాటర్ నిహారిక ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో బిజీగా కాలాన్ని గడుపుతున్నారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం పూర్తిగా సినిమా ఇండస్ట్రీలోనే తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి నిహారిక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య నిర్మాతగా పలు సినిమాలను ముందుకు తీసుకువస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న హీరోల సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ అవి సక్సెస్ కొడుతూ ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిహారిక తన అన్న రామ్ చరణ్ గతంలో మోటివేషన్ ఇచ్చినటువంటి కొన్ని మాటలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నిర్మాతగా నిలదొక్కుకోవాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి అని రాంచరణ్ తనకు సలహాలు ఇచ్చారని నిహారిక తెలిపారు. రామ్ చరణ్ అన్న చెప్పిన విధంగా “నెవర్ సే నెవర్” రూల్ను కచ్చితంగా పాటిస్తాను అని తెలిపారు. కాగా తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నిర్మిస్తున్నటువంటి బరి అనే సినిమా బడ్జెట్ ఏకంగా 60 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని వెల్లడించారు. దీంతో ఒక నిర్మాతగా నిహారిక కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ గా ఈ సినిమా ఉండనుంది.

ఈ జిల్లాలకు వడగాలులు ఎఫెక్ట్.. జర జాగ్రత్త!

Revanth-BRS: రేవంత్ చేతికి ‘గులాబీ’ గుట్టు! ఇరకాటంలో కారు పార్టీ!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments