Homeలైఫ్ స్టైల్డేంజర్.. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటిని ఒకేసారి వినియోగిస్తున్నారా..?

డేంజర్.. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటిని ఒకేసారి వినియోగిస్తున్నారా..?

క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రానిక్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నారు. వేసవికాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఎలక్ట్రానిక్ వస్తువులైనటువంటి ఏసీలు, ఫ్యాన్స్ గ్యాస్ స్టవ్స్, కుక్కర్లు, వాషింగ్ మిషన్స్ మరియు ఫ్రిజ్లు వంటివి విపరీతంగా వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గమనించాలి. వేసవి కాలంలో మరీ ముఖ్యంగా ఇటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటిలో ఒకేసారి ఒకే టైంలో వినియోగించడం డేంజర్ అని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఇంటిలో ఏసీ, ఫ్యాన్స్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్స్ మరియు ఇండక్షన్ స్టవ్ లు ఒకేసారి వినియోగించడం వల్ల విద్యుత్ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకేసారి ఉపయోగించడం వల్ల విద్యుత్ లోడ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది అని తద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సరైనటువంటి సేఫ్టీ సిస్టం లేని ఇంటిలో వైర్లు వేడికి షార్ట్ సర్క్యూట్ ద్వారా భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుని భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటిని ఒకేసారి వినియోగించడం వల్ల అధిక లోడ్ అవ్వడమే కాకుండా కరెంట్ బిల్ కూడా భారీగానే పెరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటికి ఎంతలా ఉపయోగపడతాయో అంతటి నష్టాన్ని కూడా తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్ వాడకం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ఈ చిన్న తప్పులే మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..?

ప్ర‌పంచ సామ్రాజ్యం వైపు అమెరికా అడుగులు…! 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments