HomeTelanganaపెట్రోల్ లేదంటూ తరచూ మూసివేత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

పెట్రోల్ లేదంటూ తరచూ మూసివేత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- కడ్తాల్ మండలం, ముద్విన్ గ్రామం చివరలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో తరచూ పెట్రోల్ అందుబాటులో లేకపోవడం తీవ్ర అసౌకర్యానికి దారితీస్తోంది. ఎప్పుడు వెళ్లినా పెట్రోల్ లేదు నో స్టాక్ బోర్డు లు ఏర్పాటు చేస్తూ బంక్ మూసివేయడం వల్ల స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.రోజువారీ ప్రయాణాలు చేసే ప్రజలు, రైతులు, విద్యార్థులు ఈ బంక్‌పై ఆధారపడుతున్నప్పటికీ సరైన సమయానికి ఇంధనం అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయంలో కూడా పెట్రోల్ లేకపోవడం వల్ల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత లేదని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నప్పటికీ.. స్థానికంగా ఇలాంటి సమస్యలు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బంక్‌పై తనిఖీలు నిర్వహించి, నిరంతర ఇంధన సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌పంచ సామ్రాజ్యం వైపు అమెరికా అడుగులు…! 

స‌మ్మ‌ర్‌లో ఇవి స్పెష‌ల్‌….ఇవి తింటే శ‌రీరం ఐస్ కావాల్సిందే…!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments